Breaking News
Home / National / కేంద్రమంత్రి రామ్ విలాస్ కు చేదు అనుభవం….

కేంద్రమంత్రి రామ్ విలాస్ కు చేదు అనుభవం….

హజిపూర్: కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ ప్రాంతంలో నీరు నిలిచిపోయినా అధికారులు పట్టించుకోకపోవడంపై హజిపూర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కారులో బీహార్‌లోని సమష్టిపూర్ వెళ్తుండగా స్థానిక సర్క్యూట్ హౌస్ వద్ద స్థానికులు అడ్డుకున్నారు.

మూడు రోజులుగా తమ ప్రాంతంలో నీరు నిలిచిపోయిందంటూ గంగాబ్రిడ్జి కాలనీ, చౌర్‌మహల్ నగర్ వాసులు గగ్గోలు పెడుతున్నారు. అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదంటూ ఆగ్రహావేశాలతో ఉన్నారు. తమ ప్రాంతం నుంచి నీళ్లు తోడించేంతవరకూ పాశ్వాన్‌ను కదలనిచ్చేది లేదంటూ ఈ సందర్భంగా పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో పాశ్వాన్ కారుదిగి నేరుగా వారి వద్దకు వెళ్లి శాంతింపజేసే ప్రయత్నం చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *