Breaking News
Home / Politics / వైద్య కళాశాల కోసం కృషి చేస్తాను…

వైద్య కళాశాల కోసం కృషి చేస్తాను…

సూర్యాపేట: హుజూర్‌నగర్‌ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిగా రామారావు సోమవారం నామినేషన్‌ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ పార్టీలు బీసీలకు టికెట్‌ ఇవ్వలేదని విమర్శించారు. శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను టీఆర్‌ఎస్‌ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆంధ్రా నుంచి వచ్చిన సైదిరెడ్డి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేస్తున్నారన్నారు. హుజూర్‌నగర్‌లో పరిశ్రమల నుంచి వచ్చే.. రూ.300 కోట్లను మంత్రి జగదీష్‌రెడ్డి సూర్యాపేటకు తీసుకెళ్తున్నారని విమర్శించారు. తాను గెలిస్తే హుజూర్‌నగర్‌లో మెడికల్ కాలేజీ కోసం కృషి చేస్తానని రామారావు అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *