హర్యానా : హర్యానాలోని చర్ఖి దాద్రి నియోజక వర్గంనుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెజ్లర్ బబితా ఫోగట్ బలాలి గ్రామంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఆమె ఓటు వేశారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిర్పేందర్ సింగ్ సంగ్వాన్, జేజేపీ అభ్యర్థిగా సత్పాల్ సంగ్వాన్ ఎన్నికల బరిలో ఉన్నారు.
