Breaking News
Home / National / కాంగ్రెస్ వ్యూహాలకు చెక్ పెట్టిన బీజేపీ….

కాంగ్రెస్ వ్యూహాలకు చెక్ పెట్టిన బీజేపీ….

న్యూఢిల్లీ : హరియాణాలో ఏ పార్టీకి మేజిక్‌ ఫిగర్‌ చేరుకునే పరిస్థితి లేకపోవడంతో కింగ్‌ మేకర్‌గా అవతరించిన జేజేపీ కీలకంగా మారింది. ఆ పార్టీకి సీఎం పదవిని ఆఫర్‌ చేస్తూ బీజేపీకి చెక్‌ పెట్టాలని కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. మరోవైపు జేజేపీని దారిలోకి తెచ్చేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌ చౌతాలాతో మాట్లాడి ఆయనను బీజేపీకి సహకరించేలా ఒప్పించే బాధ్యతను ఆ పార్టీ నేతలు పంజాబ్‌ మాజీ సీఎం, అకాలీదళ్‌ చీఫ్‌ ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌, ఆయన కుమారుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌లకు అప్పగించింది.

90 మంది సభ్యులతో కూడిన హరియాణా అసెంబ్లీలో బీజేపీ 40 స్ధానాల్లో కాంగ్రెస్‌ 29 స్ధానాల్లో ఇతరులు 21 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. జేజేపీ పది స్ధానాల్లో ఆధిక్యంలో ఉండటం గమనార్హం. కాగా, హరియాణాలో ప్రభుత్వ ఏర్పాటుకు 46 స్ధానాలు అవసరం.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *