Breaking News
Home / National / హర్యానాలో బీజేపీ, జేజేపీ సర్కారు: అమిత్ షా

హర్యానాలో బీజేపీ, జేజేపీ సర్కారు: అమిత్ షా

న్యూఢిల్లీ: హర్యానాలో భారతీయ జనతా పార్టీ, జన్‌నాయక్ జనతా పార్టీ సంకీర్ణ సర్కారు ఏర్పడనుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలిపారు. బీజేపీకి ముఖ్యమంత్రి, జేజేపీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఖరారు చేశారు. ఫలితాలు వచ్చినప్పటి నుంచీ దుష్యంత్‌తో బీజేపీ అధిష్టానం సంప్రదింపులు జరుపుతునే ఉంది. అటు కాంగ్రెస్ అధిష్టానం ఏకంగా సీఎం పదవి ఇవ్వచూపినా దుష్యంత్ ఆశపడలేదు. బీజేపీ, కాంగ్రెస్‌తో చర్చలు జరిపి చివరకు కమలనాథులతో జట్టు కట్టారు. కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ నివాసంలో చర్చలు జరిపి అమిత్ షా వద్దకు వెళ్లారు. ఆ తర్వాత హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌, దుష్యంత్, అనురాగ్ ఠాకూర్‌లతో కలిసి అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. హర్యానాలో సంకీర్ణ సర్కారు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

శనివారం బీజేఎల్పీ సమావేశం అనంతరం ఖట్టర్ హర్యానా గవర్నర్‌ను కలవనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 40 స్థానాలు వచ్చాయి. తిరిగి అధికారం దక్కించుకునేందుకు కావాల్సిన 46 స్థానాలు దక్కకపోవడంతో సందిగ్ధత ఏర్పడింది. 10 స్థానాలు గెలుచుకున్న జేజేపీతో పాటు ఏడుగురు ఇండిపెండెంట్లు కూడా మద్దతివ్వడం బీజేపీకి కలిసొచ్చింది. మరోవైపు 31 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ దుష్యంత్‌కు సీఎం పదవి ఇవ్వచూపినా ఆయన బీజేపీకే మొగ్గు చూపడంతో హస్తం పార్టీ పెద్దలు నిరాశచెందారు.

 

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *