Breaking News
Home / Politics / మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత సవాల్….

మంత్రి కేటీఆర్ కు బీజేపీ నేత సవాల్….

హైదరాబాద్: మంత్రి కేటీఆర్‌కు బీజేపీ నేత లక్ష్మణ్ సవాల్‌ విసిరారు. కేంద్ర నిధులపై శాఖల వారీగా కేటీఆర్‌తో చర్చకు సిద్ధమన్నారు. ఢిల్లీలో కాళ్లు.. హైదరాబాద్‌లో కన్నీళ్లు అన్నట్టు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. దక్షిణాదిని కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వ్యాఖ్యల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. రక్షణశాఖ భూములను కొట్టేయాలని టీఆర్ఎస్ భావించిందని, అయితే ఆ ప్లాన్ విఫలమైందని చెప్పారు. భూములివ్వటం కుదరదన్నందుకే కేంద్రంపై ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఎదిగిన టీఆర్ఎస్.. నేడు తెలంగాణ అస్థిత్వానికే ముప్పుగా తయారైందని లక్ష్మణ్‌ అన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *