Breaking News
Home / States / Andhra Pradesh / వారిద్దరూ సీమలో పుట్టడం దౌర్భాగ్యం: బీజేపీ

వారిద్దరూ సీమలో పుట్టడం దౌర్భాగ్యం: బీజేపీ

కర్నూలు: నేడు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పాలన సరిగ్గా లేదని, చంద్రబాబు, జగన్ రాయలసీమకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్, చంద్రబాబు సీమలో పుట్టడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. రాయలసీమ అభివృద్ధి కోసం సీమలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని, ఇక్కడ బీజేపీకి ఒక్క సీటు రాకపోయిన ఇక్కడి హక్కుల సాధనపై బీజేపీ చిత్తశుద్ధితో ఉందని తెలిపారు. రాయలసీమ హక్కుల కోసం బీజేపీ బృందం త్వరలో ఢిల్లీ పెద్దలను కలుస్తుందని వెల్లడించారు. చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం దౌర్భాగ్యమని, నరేగా నిధులతో గ్రామ సచివాలయాలకు వైసీపీ రంగులు వేస్తున్నారని తప్పుపట్టారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *