Breaking News
Home / Politics / కేసీఆర్ పై బీజేపీ నేత వ్యాఖ్యలు…

కేసీఆర్ పై బీజేపీ నేత వ్యాఖ్యలు…

హుజూర్‌నగర్‌: హిట్లర్‌, నిజాం పాలనను కేసీఆర్‌ గుర్తుకు తెస్తున్నారని గోషా మహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి రామారావును గెలిపించాలని నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన మాట్లాడారు. ధర్మ రక్షణ, దేశరక్షణ, హిందూ రక్షణ కోసం బీజేపీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్‌ పాలనలో హిందూ ముస్లింలు ఘర్షణలు పడ్డారని, మోదీ పాలనలో అన్నదమ్ముల్లా కలిసి ఉంటున్నారని పేర్కొన్నారు. 370 ఆర్టికల్‌ రద్దును దేశ ప్రజలతో పాటు ప్రపంచ దేశాలు సైతం ఆమోదించాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం కాలంలో ఏర్పాటు చేసిన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, హుజూర్‌నగర్‌, నిజామాబాద్‌ పేర్లను తొలగించి పాత పేర్లను పునరుద్ధరిస్తామన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *