Breaking News
Home / States / తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం…

తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం…

హైదరాబాద్: దేశవ్యాప్తంగా బాబా సాహెబ్‌ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కేసీఆర్‌ ప్రత్యేక రాజ్యాంగం తయారు చేసుకొని పాలన సాగిస్తున్నారని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రపంచంలో భారత రాజ్యాంగానికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉందన్నారు. 70వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ…  తెలంగాణ రాష్ట్రంలో ‘బై ద కేసీఆర్‌.. ఆఫ్‌ ద కేసీఆర్‌.. ఫర్‌ ద కేసీఆర్‌’ అనే విధంగా పాలన సాగుతోందని ఆయన విమర్శించారు. 50 వేల మంది ఆర్టీసీ కార్మికులు తాము ఉద్యోగంలో చేరతామని అంటున్నా వారిని చేర్చుకోక పోవడం బాధాకరమన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *