Breaking News
Home / National / టీఆర్ఎస్ కు అవకాశమిస్తే భవిష్యత్తు ఉండదు….

టీఆర్ఎస్ కు అవకాశమిస్తే భవిష్యత్తు ఉండదు….

ఢిల్లీ: ఏపీతో కలిసి ఉమ్మడి ప్రాజెక్టు ఎలా కడతారని బీజేపీ నేత లక్ష్మణ్‌ ప్రశ్నించారు. అంటే అప్పుడు చెప్పిన మాట అబద్ధమా?.. ఇప్పుడు చెబుతున్న మాటలు అబద్ధమా అని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇద్దరు సీఎంలు నీళ్ల పేరుతో దోపిడీకి ఎత్తుగడ వేశారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో కోట్లు వెదజల్లి టీఆర్‌ఎస్‌ గెలవాలనుకుంటోందని, టీఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశమిస్తే భవిష్యత్‌ ఉండదన్నారు. నామినేషన్లు వేసేందుకు సిద్ధమైనవారిపై దొంగ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ప్రజాధనం దుర్వినియోగం చేయడానికే జగన్‌-కేసీఆర్‌ లక్ష కోట్లతో ప్రాజెక్టులు కడతామంటున్నారని లక్ష్మణ్‌ ధ్యజమెత్తారు. తెలంగాణలో కుటుంబ, అవినీతి పాలన రాజ్యమేలుతోంది. కాంట్రాక్టర్ల జేబులు నింపడం, కమీషన్ల కోసం ఏపీ సీఎంతో కలిసి కేసీఆర్‌ ప్రాజెక్టుల నాటకం ఆడుతున్నారు. రూ.30 వేల కోట్లతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రూ.80 వేల కోట్లకు చేరుకుంది” అని లక్ష్మణ్‌ విమర్శించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *