Breaking News
Home / Politics / ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారు…

ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారు…

సూర్యాపేట: సూర్యాపేట ఆర్టీసీ డిపో వద్ద కార్మికులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు పన్నిన కుట్రలు పుట్టల నుంచి పాములు బయటకు వచ్చిన విధంగా బయటపడుతున్నాయన్నారు. ఊసరవెల్లిలా పార్టీలు మార్చిన ఎర్రబెల్లి మాటలను విని ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఆకలితోనైనా ఉంటారు కానీ ఆత్మగౌరవాన్ని చంపుకోరని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ఆర్టీసీ కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వం మెడలు వంచి కార్మికులకు న్యాయం చేస్తామన్నారు. నిన్ననే జాతీయ నాయకులతో మాట్లాడి ఆర్టీసీ సమస్యల నివేదికను పంపామని వెల్లడించారు. గవర్నర్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళినట్టు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీలో 7వేల ఉద్యోగాలు భర్తీ చేయకుండా.. 48 వేల మంది ఉద్యోగాలు తీసిన కేసీఆర్‌కి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఉద్యమానికి ఊపిరి పోసిన కార్మికులు ఆత్మ హత్యలు చేసుకోవద్దని హితవు పలికారు. ఆత్మస్థైర్యంతో ఉండి కొట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని లక్ష్మణ్ సూచించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *