Breaking News
Home / Politics / సీఎం కేసీఆర్ పై లక్ష్మణ్ విమర్శలు….

సీఎం కేసీఆర్ పై లక్ష్మణ్ విమర్శలు….

హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. యూటర్న్ సీఎంలకు ఎలాంటి పరాభవం దక్కిందో కేసీఆర్ గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ సాధన కోసం ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిదని, వారితో పెట్టుకోవడమంటే అగ్గితో గోక్కోవడమే అని హెచ్చరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేక మాయమాటలు చెప్పారని, కానీ ఆయన మాటలు నీటి మూటల్లా మిగిలిపోయాయని ధ్వజమెత్తారు.

కేసీఆర్ తీరు ప్రభుత్వ పతనానికి నాంది అని, సంఘాలు లేకపోతే కేసీఆర్ లేడని, తెలంగాణ ఉద్యమం కూడా లేదని ఎద్దేవా చేశారు. జీతాలు కార్మికుల హక్కని, వాటిని కేసీఆర్ ఇంట్లోంచి ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఆర్టీసీని కష్టాల్లోంచి గట్టెక్కించడానికి అనేక మార్గాలున్నాయని, వాటి నష్టాలకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల కాళ్లకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కేసీఆర్, నేడు వారి గుండెల్లో గునపాలు గుచ్చారని తీవ్రంగా మండిపడ్డారు. లక్షల కోట్ల రూపాయల మేర ఉన్న ఆర్టీసీ ఆస్తిని, అప్పనంగా తన అనుచరులకు దోచిపెట్టేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *