గుంటూరు: దాదాపు పదమూడేళ్ల క్రితం జరిగిన ఆయేషా మీరా హత్య రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించింది. 2007లో హాస్టల్లో జరిగిన ఈ హత్య కేసు ఎన్నో మలుపులు తిరుగుతున్న నేపథ్యంలో తాజాగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆయేషా మీరా తల్లిదండ్రులను కలవడం చర్చనీయాంశమైంది. బుధవారం తెనాలిలోని ఆయేషా తల్లిదండ్రులను ఆయన కలిసిన సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని ఆయేషా తల్లిదండ్రులు వివరించారు. ఈ కేసును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా దృష్టికి తీసుకెళ్తామని సత్యకుమార్ ఆయేషా తల్లికి హామీ ఇచ్చారు.
