Breaking News
Home / National / డెంగ్యూ బారిన పడ్డ బీజేపీ ఎమ్మెల్యే….

డెంగ్యూ బారిన పడ్డ బీజేపీ ఎమ్మెల్యే….

పాట్నా: బీహార్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే నితిన్ నవీన్ డెంగ్యూ బారిన పడ్డారు. బన్కీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నితిన్ గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతున్నారు. తాజాగా.. ఆయనను పరీక్షించిన వైద్యులు డెంగ్యూ పాజిటివ్ అని తేల్చారు. దీంతో.. వైద్యులు ఆయనకు ఇంటి వద్దనే చికిత్సనందిస్తున్నారు.

కుటుంబ సభ్యులు మంచం చుట్టూ దోమతెర కట్టారు. బీహార్‌లో ఇప్పటికే డెంగ్యూ బారిన పడి పలువురు మరణించారు. తాజాగా.. నితిన్ నవీన్ స్పందిస్తూ.. ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని.. అధికార యంత్రాంగం కూడా డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *