Breaking News
Home / National / అయోధ్యపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు….

అయోధ్యపై బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు….

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లోని పాలీ నందు జరిగిన రాంలీలా కార్యక్రమంలో పాల్గొన్న పాలీ బీజేపీ ఎమ్మెల్యే గైన్ చంద్ పరఖ్ అయోధ్యలో రామమందిర నిర్మాణంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబరు 17వ తేదీకల్లా అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మాణం చేపడతామని ఆయన ప్రకటించారు. ‘‘ అయోధ్య రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టులో విచారణ నవంబరు 17వ తేదీన పూర్తి అవుతుందని, నవంబరు 18వ తేదీన రామమందిరం నిర్మాణం చేపడతాం’’ అని ఆయన చెప్పారు. రామాలయం విషయంలో శుభవార్త వింటారు అని యూపీ సీఎం ప్రకటించిన రెండు రోజులకే బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *