Breaking News
Home / National / మహారాష్ట్రలో బీజేపీ తొలి జాబితా విడుదల….

మహారాష్ట్రలో బీజేపీ తొలి జాబితా విడుదల….

ముంబై : మహారాష్ట్రలో బీజేపీ ఏడుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. అయితే అధిష్ఠానం పార్టీలో అత్యంత సీనియర్ అయిన ఏక్‌నాథ్ ఖడ్సేతో పాటు మరో కేబినెట్ మంత్రి అయిన వినోద్ థావడే కూడా టిక్కెట్‌ను నిరాకరించింది. అనూహ్యంగా ఖడ్సే కుమార్తె రోహిణీ ఖడ్సేకు టిక్కెట్ వరించింది. బీజేపీలో ఏక్‌నాథ్ ఖడ్సే చాలా సీనియర్ నాయకుడు. అయితే ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో బీజేపీ 2016 లో రెవెన్యూ మంత్రిత్వ బాధ్యతల నుంచి తప్పించింది.

అప్పటి నుంచే ఆయనకు ఈ ఎన్నికల్లో టిక్కెట్ దక్కదని అధిష్ఠానం పరోక్ష సంకేతాలను పంపిస్తూనే ఉంది. అయితే అనూహ్యంగా ఆయన కుమార్తెకు టిక్కెట్ వరించింది. దీనిని జీర్ణించుకోలేక పోతున్న ఏక్‌నాథ్ ఖడ్సే మాత్రం తన నియోజకవర్గమైన ముక్తీనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మరోవైపు కేబినెట్ మంత్రి అయిన వినోద్ థావడేను కూడా పార్టీ పక్కన పెట్టింది. ఆయన స్థానంలో బోరివెల్లి నుంచి సునీల్ రాణే బరిలోకి దిగనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *