Breaking News
Home / National / బీజేపీ సంచలన ఉత్తర్వులు..40మంది నేతలపై సస్పెన్షన్ వేటు

బీజేపీ సంచలన ఉత్తర్వులు..40మంది నేతలపై సస్పెన్షన్ వేటు

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) : భారతీయ జనతాపార్టీ తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 40 మంది బీజేపీ నాయకులపై ఆరేళ్ల పాటు సస్పెన్షన్ వేటు విధించింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో 40 మంది బీజేపీ నాయకులు పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు నామినేషన్లు సమర్పించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 40 మంది నాయకులను ఆరేళ్లపాటు బీజేపీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లు ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్ కు గురైన నేతల స్థానంలో పార్టీ పదవుల్లో కొత్త వారిని నియమిస్తామని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర భండారీ చెప్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 12 జిల్లాల్లో అక్టోబరు 6 నుంచి 16వతేదీ వరకు మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. సస్పెన్షన్ కు గురైన వారిలో జిల్లా స్థాయి బీజేపీ నాయకులున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *