Breaking News
Home / National / 38 మందితో బీజేపీ తొలి జాబితా

38 మందితో బీజేపీ తొలి జాబితా

సామాజిక సమతౌల్యత.. కొత్త వారికీ చాన్స్
శనివారం చేరిన వారికీ టికెట్లు
ఆంధోల్‌ నుంచే బాబూమోహన్
భూపాలపల్లిలో కీర్తిరెడ్డి, సూర్యాపేటలో సంకినేని
కరీంనగర్లో బండి సంజయ్‌, కోరుట్లలో వెంకట్
భద్రాచలం నుంచి కుంజా సత్యవతి
లక్ష్మణ్‌, కిషన్‌ సహా తాజా మాజీలకు ఖరారు
గోషామహల్‌ రాజాసింగ్‌కే
న్యూఢిల్లీ/హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి బీజేపీ తొలి విడతగా 38 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌చార్జి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా శనివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో తాజా మాజీ ఎమ్మెల్యేలందరితోపాటు పలువురు కొత్త వారికి చోటు లభించింది. ముగ్గురు మహిళలకూ అవకాశం కల్పించారు. ఇటీవలే బీజేపీ తీర్థం పుచ్చుకున్న బాబూమోహన్‌ వంటి వారికీ సీటు దక్కింది. మొత్తంగా వివిధ సామాజికవర్గాలకు ప్రాధాన్యం కల్పిస్తూ సమతుల్యత పాటించారు.

38 మందిలో ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 9 మంది బీసీలకు అవకాశం కల్పించారు. పోటీ ఎక్కువలేనివి, వివాదాస్పదం కానివాటిని, రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాలను మొదటి జాబితాలో చేర్చినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. జాబితా విడుదలకు ముందు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై చర్చించారు. మధ్యాహ్నం తెలంగాణ నేతలు అమిత్‌షా నివాసంలో భేటీ అయి చర్చలు జరిపారు. కాగా కోరుట్లకు చెందిన పీసీసీ కార్యదర్శి డాక్టర్‌ వెంకట్‌ శనివారమే పార్టీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో బీజేపీలో చేరగా.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. మరోవైపు తెలంగాణతోపాటే ఎన్నికలు జరగనున్న 90 స్థానాలు గల ఛత్తీస్‌గఢ్‌కు తొలి విడతగా 77 మందిని, 50 స్థానాలు కలిగిన మిజోరంనకు 13 మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదే..
ముషీరాబాద్‌- కె.లక్ష్మణ్‌, అంబర్‌పేట- జి.కిషన్‌రెడ్డి, ఖైరతాబాద్‌- చింతల రామచంద్రారెడ్డి, ఉప్పల్‌- ఎన్‌వీఎ్‌సఎస్‌ ప్రభాకర్‌, గోషామహల్‌- టి.రాజాసింగ్‌, మల్కాజిగిరి- ఎన్‌.రాంచందర్‌రావు, ఎల్‌బీ నగర్‌- పేరాల శేఖర్‌రావు, పెద్దపల్లి- జి.రామకృష్ణారెడ్డి, సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు, మేడ్చల్‌- పి.మోహన్‌రెడ్డి, కల్వకుర్తి- టి.ఆచారి, మునుగోడు- జి.మనోహర్‌రెడ్డి, పాలేరు- కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, కరీంనగర్‌- బండి సంజయ్‌, దుబ్బాక- ఎం.రఘునందన్‌రావు, ఆందోల్‌- బాబూమోహన్‌, భద్రాచలం- కుంజా సత్యావతి, ఆదిలాబాద్‌- పాయల శంకర్‌, ముథోల్‌- పడకంటి రమాదేవి, నారాయణపేట- ఆర్‌.పాండురెడ్డి, మక్తల్‌- బి.కొండయ్య, షాద్‌నగర్‌- ఎన్‌.శ్రీవర్ధన్‌రెడ్డి, పరకాల- పి.విజయచంద్రారెడ్డి, భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి, బోథ్‌- మాధవి రాజు, బెల్లంపల్లి- కొయ్యల ఎమాజి, కామారెడ్డి- కె.వెంకటరమణారెడ్డి, నిజామాబాద్‌ రూరల్‌- కేశపల్లి ఆనంద్‌రెడ్డి, పినపాక- సంతోష్‌కుమార్‌ చందా, ఆర్మూర్‌- ప్రొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి, ధర్మపురి- కన్నం అంజయ్య, మానకొండూరు- గడ్డం నాగరాజు, తాండూరు- పటేల్‌ రవిశంకర్‌, కార్వాన్‌- టి.అమర్‌సింగ్‌, గద్వాల- గద్వాల్‌ వెంకటాద్రిరెడ్డి, అచ్చంపేట- మల్లేశ్వర్‌ మేడిపూర్‌, సత్తుపల్లి- నంబూరి రామలింగేశ్వర్‌రావు, కోరుట్ల- జె.వెంకట్‌.

Check Also

బాలికను బలవంతంగా రోడ్డుపై పడుకోబెట్టి, తలపై బైక్‌ తోలిన దుండగులు..

Share this on WhatsAppలక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఘోరం జరిగింది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగొస్తున్న బాలికపై కొందరు దుండగులు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *