Breaking News
Home / States / Andhra Pradesh / నెల్లూరు బీచ్‌లకు బ్లూఫాగ్‌ గుర్తింపు

నెల్లూరు బీచ్‌లకు బ్లూఫాగ్‌ గుర్తింపు

నెల్లూరు: జిల్లాలో మైపాడు, కొత్త కోడూరు బీచ్‌లకు గుర్తింపు కోసం కేంద్ర బృందం జిల్లాలో పర్యటించింది. అటవీ, పర్యావరణ శాఖ అధికార బృందాలు ఈ బీచ్‌లను జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి సర్వే చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ ఎంవోఎఫ్‌ సంజయ్‌ జ్వాల మాట్లడుతూ జిల్లాలోని మైపాడు, కొత్తకోడూరు బీచ్‌లను బ్లూ ఫాగ్‌గా గుర్తించేందుకు వచ్చామన్నారు. ఈ గుర్తింపు ఉన్న బీచ్‌ల్లో పర్యాటకులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పిస్తారని, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రకు చర్యలు తీసుకుంటామన్నారు. సముద్ర జలం కాలుష్యం బారిన పడకుండా తీర ప్రాంత జాలర్లు కాపాడుకోవాలని కోరారు. బ్లూ ఫాగ్‌ కింద ఈ బీచ్‌లు అభివృద్ధి చెందితే జిల్లా పర్యాటకంగా భాసిల్లుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీటీసీ డీవీఎం బాబ్జి, పర్యాటక శాఖ సహాయ సంచాలకులు రాజకాంతి నాయుడు, ఈఈ సుబ్రహ్మణ్యం, ఏఈఈ వంశీ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *