Breaking News
Home / States / Andhra Pradesh / బోటు వెలికితీత ప్రారంభం…144 సెక్షన్ అమలు…

బోటు వెలికితీత ప్రారంభం…144 సెక్షన్ అమలు…

తూర్పు గోదావరి : తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద ఇటీవల పర్యాటకులతో వెళ్తూ మునిగిపోయిన బోటును వెలికి తీసే పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. బోటును వెలికి తీసేందుకు ప్రయత్నించిన నేవీ, సహాయక బృందాలు వెనుదిరగడంతో ప్రభుత్వం ఆ బాధ్యతను బాలాజీ మెరైన్‌ సంస్థకు అప్పగించింది. దీంతో సంస్థ యజమాని ధర్మాడి సత్యం తన బృందం సభ్యులైన 25 మందితో కలసి వెలికితీతకు బయలుదేరారు. బోటును వెలికి తీసేందుకు అవసరమైన క్రేన్‌, ప్రొక్లెయిన్‌, బోటు, పంటు, 800 మీటర్ల వైరు బోటు, రెండు లంగర్లు, మూడు లైలాండ్‌ రోప్‌లు, పది జాకీలు, ఇతర సామగ్రిని ఘటనా స్థలానికి తరలిస్తున్నారు. బోటు వెలికితీత నేపథ్యంలో ఆ ప్రాంతానికి ఎవరూ రావొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *