Breaking News
Home / States / Andhra Pradesh / బోటు వెలికితీత పనులు పునఃప్రారంభం

బోటు వెలికితీత పనులు పునఃప్రారంభం

దేవీపట్నం: ఇటీవల తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసేందుకు ప్రయత్నాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. నదిలో వరద ఉధృతి తగ్గడంతో కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీనికి అవసరమైన సామగ్రిని దేవీపట్నం పోలీస్‌స్టేషన్‌ నుంచి సంఘటనా స్థలానికి తరలించారు. ఇటీవల మూడు రోజుల పాటు నదిలో లంగర్లు వేసి బోటును వెలికితీసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. తాజాగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు వెలికితీత పనులను పునఃప్రారంభించినట్లు సత్యం తెలిపారు. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 38 మృతదేహాలను అధికారులు గుర్తించగా, మరో 13 మృతదేహాల ఆచూకీ లభించాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *