Breaking News
Home / States / ఆ ముగ్గురే తెలంగాణను దోచుకుంటున్నారు…

ఆ ముగ్గురే తెలంగాణను దోచుకుంటున్నారు…

జగిత్యాల: ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె గురువారం నాటికి 13వ రోజుకు చేరింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో కార్మికుల సమ్మెకు ఉపాధ్యాయ సంఘాల నాయకులు, చొప్పదండీ మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా శోభ మాట్లాడుతూ… ఏపీ సీఎం జగన్‌కు ఉన్న సోయి సీఎం కేసీఆర్‌కు లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల్లో అగ్గి రగులుతోందని, బుగ్గి అయిపోతారని అన్నారు. కేసీఆర్, కృష్ణారెడ్డి, రామేశ్వర్ రావులు తెలంగాణను దోసుకొంటున్నారని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆర్టీసీ ఉద్యమం కెసీఆర్ ప్రభుత్వానికి ఊపిరి పీల్చనివ్వకుండా విలీనం సాధించుకోవాలన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి కేసులు పెడితే ఊరుకోమన్నారు. కేసీఆర్ చుట్టూ ఉన్న మంత్రులు తెలంగాణ ద్రోహులని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు అంతా ఏకమై టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడించాలని శోభ పిలుపు ఇచ్చారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *