Breaking News
Home / Film News / రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ హీరో…

రియల్ హీరో అనిపించుకున్న బాలీవుడ్ హీరో…

ఫిల్మ్ న్యూస్: ఐశ్యర్యారాయ్ మేనేజర్ అర్చనను కాపాడిన షారుఖ్ ఖాన్ రియల్ హీరో అనిపించుకున్నారు. ఈనెల 27న అమితాబ్ బచ్చన్ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సినీ తారలు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా తన కూతురుతో పాటు ఐశ్యర్యారాయ్ మేనేజర్ అర్చన లాన్ లో తిరుగుతున్నారు. పొరపాటున అక్కడున్న దీపానికి ఆమె లెహంగా తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు లేచాయి. భయంతో ఆమె కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆక్కడున్న వారంతా షాక్ కు గురై అలాగే చూస్తూండి పోయారు.

ఆ సమయంలో అమితాబ్ తో మాట్లాడుతున్న షారుఖ్ మాత్రం వేగంగా స్పందించారు. ఆమె వద్దకు పరుగులు తీసి, తన జాకెట్ సాయంతో మంటలను ఆర్పేశారు. అనంతరం ఆమెను లీలావతి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ ఘటనలో అర్చనకు 15 శాతం గాయాలయ్యాయని, ఆమె త్వరగా కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. మరోవైపు, షారుఖ్ కూడా ఈ సందర్భంగా స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *