Breaking News
Home / Film News / ఫ్లాష్.. బాలీవుడ్‌లో మరో విషాదం..

ఫ్లాష్.. బాలీవుడ్‌లో మరో విషాదం..

బాలీవుడ్‌ను ఇటీవల వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. మూడు నెలల వ్యవధిలో ఐదుగురు బాలీవుడ్ ప్రముఖులు మరణించారు. రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సరోజ్ ఖాన్ మరణించారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు, కమెడియన్ జగ్దీప్ బుధవారం రాత్రి అనారోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు. ఆయన వయసు 81 సంవత్సరాలు. రమేష్ సిప్పీ తెరకెక్కించిన అమితాబ్ సూపర్ హిట్ మూవీ ‘షోలే’లో సూర్మా భూపాలీ పాత్ర జగ్దీప్ నట జీవితంలోనే ఓ మైలురాయి లాంటిది. ఆ పాత్రకు ఆయనకు వచ్చిన ప్రశంసలు అన్నీఇన్నీ కావు. అంతేకాదు, అందాజ్ అప్నా అప్నా సినిమాలో జగ్దీప్ పోషించిన సల్మాన్ తండ్రి పాత్ర కూడా ఆయన నట జీవితంలో చెప్పుకోదగ్గది. ఆయన చేసిన పాత్రలు దాదాపుగా హాస్య ప్రధానమైనవే కావడం గమనార్హం. బాల్య నటుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన జగ్దీప్ దాదాపు 300లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు.

Check Also

బుల్లితెర నటుడికి కరోనా పాజిటివ్..! ఆందోళనలో టీవీ యాక్టర్స్.!

Share this on WhatsAppతెలంగాణలో కరోనా వైరస్ భారీగా విజృంభిస్తుంది. పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరినీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *