Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఐటీ శాఖకు భారీ షాకిచ్చిన బాంబే హైకోర్టు

ఐటీ శాఖకు భారీ షాకిచ్చిన బాంబే హైకోర్టు

ముంబై: వొడాఫోన్ ఐడియా(వీఐఎల్)కు భారీ ఊరట లభించింది. ఆ సంస్థ నుంచి వసూలు చేసిన 788.39 కోట్ల రూపాయలను మూడు వారాల్లోగా తిరిగి వెనక్కి ఇవ్వాలని ఆదాయపు పన్ను శాఖను బాంబే హైకోర్టు ఆదేశించింది. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెస్‌మెంట్ ఆర్డర్‌కు గాను టెల్కో, ఐటీ శాఖల మధ్య వివాదం మొదలైంది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.286.86 కోట్ల ఆదాయాన్ని ప్రకటించిన సంస్థ.. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 6,600 కోట్ల భారీ నష్టాలను చవి చూడడంపై ఐటీశాఖ అనుమానాలు వ్యక్తం చేసింది.

2017-18 సంవత్సరానికి సంబంధించిన రాబడిపై దర్యాప్తు చేయాలని భావించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్‌ వద్ద పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ షేర్ లైసెన్స్ ఫీజు, ప్రీపెయిడ్ డిస్ట్రిబ్యూటర్లకు డిస్కౌంట్‌పై సోర్స్ వద్ద పన్నును తగ్గించకపోవడం తదితర విషయాలను పేర్కొన్న దర్యాప్తు అధికారి డిమాండ్ పన్ను పెంచే అవకాశాన్ని పరిశోధించాలని ఆయన కోరారు.

కాగా, ఒక ఏడాది లాభాలు ప్రకటించిన టెల్కో.. ఆ తర్వాతి సంవత్సరం నష్టాన్ని ప్రకటించినందున వాదనలు అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. రూ.788.39 కోట్లను వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వీఐఎల్‌కు కోర్టు తీర్పుతో ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. వొడాఫోన్ ఐడియాకు అనుకూలంగా తీర్పు రావడం ఇది రెండోసారి. రూ.374.26 కోట్లను తిరిగి టెల్కోకు చెల్లించాలంటూ ఈ నెల మొదట్లో ఐటీ విభాగాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.

బాంబే హైకోర్టు తీర్పుతో వొడాఫోన్ ఐడియా ఊపిరి పీల్చుకుంది. టెల్కో చివరిసారిగా ప్రకటించిన ఫలితాల్లో సంస్థ ఆదాయం 4.3 శాతం క్షీణించి రూ.11,269.9 కోట్లకు చేరుకుంది. కాగా, ఆర్థిక సంవత్సరం 2020, 2021 సంవత్సరాలకు గాను 24,400 కోట్ల రూపాయల విలువైన స్పెక్ట్రం బకాయిలను టెలికం విభాగానికి వొడాఫోన్ ఐడియా చెల్లించాల్సి ఉంది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *