Breaking News
Home / States / Andhra Pradesh / ఆయనను కలవటానికి కారణం ఏంటి?…

ఆయనను కలవటానికి కారణం ఏంటి?…

విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేయడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. దీనిపై విజయవాడ టీడీపీ నేత బోండా ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల క్రితం వంశీ సీఎం జగన్ ను కలిశారని అన్నారు. సీఎం జగన్ ను కలిసిన తర్వాత వంశీ మీడియా ముందుకు రాలేదని, అసలు జగన్ ను ఎందుకు కలిశారో వంశీ ఇప్పటివరకు చెప్పలేదని అన్నారు. అయినా, టీడీపీకి ఇలాంటి పరిస్థితులు కొత్తేమీ కాదని, ఎన్నికల తర్వాత చాలామంది పార్టీని వీడారని ఉమ పేర్కొన్నారు. వంశీ వాట్సాప్ లో తన రాజీనామా లేఖలను పంపడం పట్ల ఆయన స్పందిస్తూ, ఇప్పుడంతా వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజీనామాలు చేసే విధానం వచ్చిందని వ్యాఖ్యానించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *