Breaking News
Home / States / Andhra Pradesh / పుస్తక ప్రదర్శన నేటితో ముగింపు

పుస్తక ప్రదర్శన నేటితో ముగింపు

విజయవాడ: పుస్తక ప్రదర్శన ఆదివారంతో ముగియనుంది. ఈ ప్రదర్శనను 13వ తేదీ వరకు పొడిగించినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి పబ్లిషర్లు, విక్రయదారులు దుకాణాలను సర్దేశారు. ఇప్పటికే చాలా స్టాల్స్‌ ఖాళీ అవుతున్నాయి. శనివారం నుంచి విద్యాసంస్థలకు సెలవులు కావడంతో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ప్రదర్శనకు వచ్చారు. ఆదివారం పుస్తకప్రియుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వాస్తవానికి పుస్తక ప్రదర్శన పూర్తయ్యే నాటికి సుమారుగా లక్షమంది సందర్శకులు వస్తారని విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రతినిధులు భావించారు. ఈసారి మాత్రం ఆదివారం రోజే సందర్శకుల రద్దీ కనిపించింది. రెండు, మూడేళ్లతో పోల్చి చూస్తే ఈ ఏడాది సందర్శకుల సంఖ్య తగ్గిందని పలువురు చెబుతున్నారు. అదే సమయంలో ఈ ఏడాది స్టాల్స్‌ ఏర్పాటు బాగుందని అభిప్రాయపడుతున్నారు.

Check Also

నేడు నామినేషన్‌ వేయనున్న జగన్‌

Share this on WhatsAppసీఎస్‌ఐ చర్చి గ్రౌండ్‌లో బహిరంగసభ పులివెందుల: పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *