Breaking News
Home / States / Andhra Pradesh / ఆయన మాటలు ప్రజలు నమ్మరు….

ఆయన మాటలు ప్రజలు నమ్మరు….

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు సహజతత్వం అందరికీ తెలుసని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గతంలో మీడియాపై ఆంక్షలు పెట్టింది ఎవరని ప్రశ్నించారు. ప్రెస్‌మీట్‌లకు రావొద్దని ఆదేశాలు జారీ చేసింది ఎవరని నిలదీశారు. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరని, ఆయన మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని, పత్రికా స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని ఎలా అంటారని అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రూ.47 వేల కోట్ల అప్పులు మిగిల్చి వెళ్లిందని ఆరోపించారు. చిన్నచిన్న కాంట్రాక్టర్ల బిల్లులు ఆపేశారని, ఎన్నికల ముందు అప్పులు చేసి మరీ పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చారని బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *