Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు…

చంద్రబాబుపై మంత్రి బొత్స వ్యాఖ్యలు…

విజయవాడ: దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పెట్టిన పథకాలకు టీడీపీ అధినేత చంద్రబాబు పేర్లు మార్చుకున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. తన ఎమ్మెల్యేలు తప్పు చేస్తే సీఎం జగన్‌ చర్యలు తీసుకున్నారని, చంద్రబాబు హయాంలో ఎంతమంది టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కాల్‌ మనీ వ్యవహారంలో ఎంతమందిపై కేసులు పెట్టారని నిలదీశారు. చంద్రబాబు తన సమావేశంలో కరెంట్‌ ఆపుకుని..కరెంట్‌ పోయిందని చీప్‌ ట్రిక్‌లు చేస్తున్నారని ఆరోపించారు. పెయిడ్‌ ఆర్టిస్టులు పోయి టీడీపీ ఆర్టిస్టులు వచ్చారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *