Breaking News
Home / States / Andhra Pradesh / చంద్రబాబుపై వచ్చిన పోస్టింగ్స్‌ను ఖండించిన బొత్స

చంద్రబాబుపై వచ్చిన పోస్టింగ్స్‌ను ఖండించిన బొత్స

విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్స్‌ని మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. సోషల్ మీడియా పోస్ట్‌లపై పోలీసులు ఏం చేయాలో వారి పని వారు చేస్తున్నారన్నారు. పెయిడ్ ఆర్టిస్టుని పెట్టించి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే వస్తాయని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్ట్‌లను తాము ప్రోత్సహించడంలేదన్నారు. చంద్రబాబు నేర్పిన విద్యే ఆయనకు తిప్పలు తెస్తున్నాయని చెప్పారు. చంద్రబాబు ఆలోచన ధోరణి మారాలని సూచించారు. చంద్రబాబు ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నీచమన్నారు. లక్ష మందికి ఉద్యోగ అవకాశం కల్పిస్తే దానిపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబు వ్యాఖ్యలు వింటుంటే అసహ్యం వేస్తోందన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *