Breaking News
Home / States / రైలు ఢీకొని బాలుడు మృతి…

రైలు ఢీకొని బాలుడు మృతి…

కాచిగూడ: ఫలక్‌నుమా, బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు ఢీకొని ఓ బాలుడు మృతి చెందిన ఘటన జరిగింది.  ఫాతిమానగర్‌కు చెందిన సాదత్ కుమారుడు సయ్యద్ అబ్దుల్ రహమాద్(11) స్థానిక పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. పతంగి ఆడుకుంటూ ఫలక్‌నుమా, బుద్వేల్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు దాటుతుండగా, అదే సమయంలో అతడిని రైలు ఢీకొంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందడంతో సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *