నిజామాబాద్: జిల్లాలోని కోటగల్లి పూలాంగ్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కరెంటు తీగలు తెగిపడటంతో విద్యుదాఘాతంతో ఐదవ తరగతి చదువుతున్న అయాన్ఖాన్(11) మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, విద్యుత్ అధికారులు సంఘటనపై విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని, బాలుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు.
