శ్రీకాకుళం : స్నానం కోసం కుడికాలువలోకి వెళ్లిన బాలుడు ప్రవాహ ఉధృతికి గల్లంతైన ఘటన గురువారం పెద్ద కోరాడ వద్ద చోటు చేసుకుంది. హిరమండలం మేజర్ పంచాయతీ పెద్ద కోరాడ గ్రామానికి చెందిన దామోదరరావు అనే బాలుడు ఈరోజు ఉదయం స్నానం చేసేందుకు కుడికాలువలో దిగాడు. ఎగువ నుండి వస్తున్న ప్రవాహ ఉధృతికి బాలుడు కాలువలో గల్లంతయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది బాలుడి కోసం గాలింపు చేపట్టారు. అధికారులకు తెలిపి ఎగువ నుండి ప్రవాహ ఉధృతిని తగ్గించారు.
