Breaking News
Home / National / అస్సాంలో భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న బ్రహ్మపుత్ర

అస్సాంలో భారీ వర్షాలకు ఉప్పొంగుతున్న బ్రహ్మపుత్ర

న్యూఢిల్లీ: అస్సాంలో భారీ వర్షాల కారణంగా బ్రహ్మపుత్ర నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. వరద ఉధృతికి నదీ పరీవాహక ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. దాదాపు 15 లక్షల మందిపై దీని ప్రభావం పడగా… వరదల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో ప్రస్తుతం బ్రహ్మపుత్ర ఉధృతిని కళ్లకు కడుతోంది. మోరిగాన్ జిల్లాలోని ఓ స్కూల్ భవనం పేకమేడలా నదిలో కూలిపోతున్న దృశ్యాలు ఇందులో కనిపిస్తున్నాయి. తెంగగూరి ప్రాంతంలోని ప్రాథమిక పాఠశాలగా చెబుతున్న ఈ భవనం శనివారం అందరూ చూస్తుండగానే సెకన్ల వ్యవధిలో కూలిపోయింది. పాఠశాలలకు ఇప్పటికే సెలవులు ప్రకటించడంతో పెను ప్రమాదం తప్పింది.

కాగా బ్రహ్మపుత్రతో పాటు దిఖౌ, ధన్‌సిరి, జియా బరాలీ, పుతిమారి, బేకి నదులు సైతం ప్రమాద స్థాయికి ఎగువన ప్రవహిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 24 గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Check Also

మరోసారి వార్తల్లో నిత్యానంద

Share this on WhatsAppఅహ్మదాబాద్: నిత్యానంద నిర్వహణలో ఉన్న స్కూల్లో తమ ఇద్దరు కూతుళ్లను నిర్భంధించారని..వారిని విడిపించాలంటూ గుజరాత్ హైకోర్టులో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *