Breaking News
Home / National / పసిడి ధరకు బ్రేక్.. 33 వేల దిగువకు బంగారం

పసిడి ధరకు బ్రేక్.. 33 వేల దిగువకు బంగారం

న్యూఢిల్లీ: పసిడి ధరకు బ్రేక్ పడింది. శనివారం నాటి ట్రేడింగ్‌లో రూ.155 తగ్గి రూ. 33 వేల దిగువకు పడింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, స్థానిక నగల తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న పసిడి ధరకు శనివారం ఫుల్‌స్టాప్ పడింది. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.155 తగ్గి రూ.32,875కు చేరుకోగా, 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం ధర రూ.32, 725గా ఉంది. కొనుగోళ్లు మందగించడమే పసిడి ధర పతనానికి కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి.

మరోవైపు, వెండి కూడా కిలోకు రూ.600 తగ్గి రూ. 40 వేల కిందికు దిగి వచ్చింది. నాణేల తయారీదారులు, పారిశ్రామిక వర్గాల నుంచి డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణమని ట్రేడర్లు చెబుతున్నారు. శనివారం కిలోకు రూ.600 తగ్గిన వెండి రూ.38,850కి దిగివచ్చింది.

Check Also

కన్నీరుపెట్టిస్తున్న ఓ అమర జవాను కథ…..

Share this on WhatsAppపుణె: వ్యాధితో బాధపడుతోందని తెలిసీ ప్రేమ వివాహం చేసుకుని ఓ యువతికి జీవితాన్ని ప్రసాదించాడు. ఎల్లప్పుడూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *