Breaking News
Home / World News / బ్రెకింగ్..అమెరికాలో కాల్పులు

బ్రెకింగ్..అమెరికాలో కాల్పులు

న్యూఆర్లీన్స్: అమెరికాలోని న్యూఆర్లీన్స్ నగరంలో ఆదివారం కాల్పుల కలకలం రేగింది. నగరంలోని ఫ్రెంచ్ క్వార్టర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున కాల్పులు జరగడంతో 11 మందికి గాయాలయ్యాయి. కాల్పులు జరుగుతున్నాయన్న సమాచారం పోలీసులకు స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 3.30కి అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న తమకు కాల్పుల శబ్దం వినిపించిందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో అతడికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రాణాపాయం లేనప్పటికీ ఇద్దరి పరిస్థితి మాత్రం విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *