Breaking News
Home / National / బ్రేకింగ్ న్యూస్: పాక్ మాజీ ప్రధానికి గుండెపోటు

బ్రేకింగ్ న్యూస్: పాక్ మాజీ ప్రధానికి గుండెపోటు

ఇస్లామాబాద్‌: ఇటీవల అస్వస్థతకు గురైన పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ లాహోర్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే, చికిత్స పొందుతున్న ఆయనకు తాజాగా గుండెపోటు వచ్చినట్టు పాక్‌ సీనియర్‌ పాత్రికేయుడు హమీద్‌ మిర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నప్పటికీ నీరసంగా కనిపిస్తున్నారని సర్వీస్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న షరీఫ్‌కు ప్లేట్‌లెట్‌ల సంఖ్య పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. తొలుత వాటి సంఖ్య పెరిగినప్పటికీ మళ్లీ పడిపోవడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఆయన అనారోగ్యం దృష్ట్యా చౌదరి చక్కెర మిల్లుల కేసులో షరీఫ్‌కు బెయిల్‌ మంజూరైంది. పూచీకత్తు కింద ఆయన రూ.10మిలియన్ల విలువైన రెండు బాండ్లను సమర్పించాలని షరతు విధిస్తూ లాహోర్‌ హైకోర్టు బెయిల్‌ను మంజూరు చేసినట్టు డాన్‌ పత్రిక తెలిపింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *