Breaking News
Home / Film News / ప్రేమకు బ్రేకప్…కెరీర్‌పై దృష్టి …

ప్రేమకు బ్రేకప్…కెరీర్‌పై దృష్టి …

ఫిల్మ్ న్యూస్: విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శృతీహాసన్ తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. రెండు భాషలకు చెందిన పలువురు అగ్ర హీరోలతో నటించింది. కెరీర్ పీక్‌లో ఉన్న దశలోనే లండన్‌కు చెందిన గాయకుడు మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడింది. ఆ క్రమంలో కెరీర్‌ను కూడా నిర్లక్ష్యం చేసింది. అయితే మైకేల్‌తో ఆమె ప్రేమ ఎంతో కాలం కొనసాగలేదు.

మైకేల్‌తో ప్రేమకు బ్రేకప్ చెప్పేసి శృతి మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టింది. అయితే మైకేల్‌తో విడిపోవడానికి గల కారణాన్ని ఇప్పటివరకు ఎక్కడా వెల్లడించలేదు. మంచు లక్ష్మి నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరైన శృతి తన బ్రేకప్ గురించి తొలిసారి మాట్లాడింది. ‘బయటకు కఠినంగా కనిపించినా నేను చాలా అమాయకంగా ఉంటాను. నేను చాలా ఎమోషనల్. దాంతో నా చుట్టు ఉన్న వారు నాపై ఆధిపత్యం చెలాయిస్తూ నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు. నన్ను తమ ఆధీనంలో ఉంచుకోవాలనుకుంటారు. అయితే అవన్నీ నాకు మంచి అనుభవాలే. మైకేల్‌తో బ్రేకప్ దురదృష్టకరం’ అని శృతి చెప్పింది.

Check Also

బిగ్ బాస్-3 కంటెస్టెంట్ కు కరోనా..!

Share this on WhatsAppబుల్లి తెరను కరోనా వైరస్ పట్టి పీడిస్తోంది. ఇప్పటికే పలువురు బుల్లి తెర నటీనటులు కరోనా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *