తూర్పు గోదావరి: బుధవారం తూర్పు గోదావరిలోని పట్టణంలో శ్రీవిద్యా విద్యా సంస్థల స్కూల్ బస్సు తుని మండలం నుండి కెఓ మల్లవారం, దొండవకా, పోలవరం, తదితర ప్రాంతాల్లో స్కూల్ పిల్లలను తీసుకొని వస్తుండగా స్థానిక పాయకరావుపేట వై.జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో బస్సు వెనుక భాగాన్ని లారీ ఢీకొని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో బస్సులో ఉన్న 14 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరో నలుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
