కెనడా: ఈ నెల 4వ తేదీన తెల్లవారుజామున 1.30 గంటలకు కెనడాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంజాబ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. విండ్సర్లోని సెయింట్ క్లైర్ కళాశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఒంటారియోలోని ఆయిల్ స్ప్రింగ్స్ సమీపంలో ఆయిల్ హెరిటేజ్ రోడ్‌పై చోటుచేసుకున్న కారు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను తన్వీర్ సింగ్, గుర్వీందర్ సింగ్, హర్‌ప్రీత్ కౌర్‌లుగా గుర్తించారు. వారిందరి వయసు 20 ఏళ్ల లోపే ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన సమాచారం ప్రకారం అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ఒంటారియో పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
