Breaking News
Home / Crime / నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య….

నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య….

తుమకూరు: కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తుమకూరుకు చెందిన మహంతీశ్‌ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగుడు కత్తితో పోడిచి పరారయ్యాడు. మహంతీశ్‌ తప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ దుండగుడు వదలకుండా వెంటపడి కత్తితో గాయపరిచాడు. తీవ్రంగా గాయపడిన మహంతీశ్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మహంతీశ్‌ అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. హత్యకుగల కారణాలు తెలియరాలేదు.

Check Also

జెంషెడ్‌పూర్‌, హంపిలో భూ ప్రకంపం

Share this on WhatsAppదేశంలో ఇవాళ రెండు చోట్ల భూకంపం సంభవించింది. జార్ఖండ్‌, మహారాష్ట్రలో భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *