హైదరాబాద్: జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం పలగాని హోటల్ ఎదురుగా శనివారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. మృతుడు గొల్లపూడి గ్రామానికి చెందిన మమ్మీ హరి ఉదయ్ కుమార్(28)గా గుర్తించారు. కర్ణాటకలో బ్యాంకులో జాబ్ చేస్తున్న అతడు హైదరాబాద్ నుంచి గొల్లపూడి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
