Breaking News
Home / National / పేటీఎంతో జతకట్టిన బీఎస్ఎన్ఎల్..

పేటీఎంతో జతకట్టిన బీఎస్ఎన్ఎల్..

న్యూఢిల్లీ: ప్రభుత్వం రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్.. పేమెంట్ యాప్ ‌పేటీఎంతో జతకట్టి ‘స్మార్ట్ వై-ఫై ఆన్‌బోర్డింగ్ ఫీచర్‌’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా బీఎస్ఎన్‌ఎల్ పబ్లిక్ వై-ఫైను యూజర్లు వినియోగించుకోవచ్చు. ఖాతాదారులు బీఎస్ఎన్ఎల్ వై-ఫై హాట్‌స్టాప్‌ లొకేషన్‌లోకి రాగానే పేటీఎం నుంచి యూజర్లకు నోటిఫికేషన్ వస్తుంది. వై-ఫైను ఉపయోగించుకోవాలనుకుంటే పేటీఎం యాప్ ద్వారా ప్లాన్లను ఎంచుకుని వై-ఫైను ఉపయోగించుకోవచ్చు. అలాగే, డేటా రోమింగ్ అవకాశం కూడా ఉంది. అంతేకాదు, డ్యాష్‌బోర్డు ద్వారా డేటా ఎంత ఖర్చు అయింది? కాలపరిమితి ఎంత? వంటి వివరాలను తెలుసుకోవచ్చు. పబ్లిక్ వై-ఫైని ఉపయోగించుకునే విషయంలో ఈ ఆఫర్ విప్లవం కానుందని బీఎస్ఎన్ఎల్ సీఎఫ్ఏ డైరెక్టర్ వివేక్ బంజాల్ పేర్కొన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *