Breaking News
Home / National / బీఎస్ఎన్ఎల్‌కు 78,300 మంది టాటా!

బీఎస్ఎన్ఎల్‌కు 78,300 మంది టాటా!

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లు ఇటీవల ప్రకటించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) గడువు మంగళవారంతో ముగిసింది. మొత్తంగా 92,700 మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకున్నారు. వీరిలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు 78,300 మంది కాగా, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు 14,378 మంది. అన్ని సర్కిళ్ల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 78,300 మంది ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకున్నారని బీఎస్ఎన్ఎల్ ఎండీ పీకే పుర్వార్ తెలిపారు. తాము 82 వేల మందిని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలిపారు. ఎంటీఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. తాము పెట్టుకున్న టార్గెట్‌కు మించి ఉద్యోగులు వీఆర్ఎస్‌ను ఎంచుకున్నట్టు తెలిపారు. తాము నిజానికి 13,650 మందినే టార్గెట్‌గా పెట్టుకున్నామని, కానీ 14,378 మంది స్వచ్ఛంద పదవీ విరమణకు ముందుకు వచ్చినట్టు తెలిపారు. దీని వల్ల వేతనాల భారం ఏడాదికి రూ. 2,272 కోట్ల నుంచి రూ. 500 కోట్లకు తగ్గుతుందన్నారు. వీఆర్ఎస్ అనంతరం తమ ఉద్యోగుల సంఖ్య 4,430కి తగ్గుతుందని, సంస్థ సేవలను కొనసాగించేందుకు వీరు సరిపోతారని సునీల్ కుమార్ వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *