Breaking News
Home / Lifestyle / Business / బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు పొడిగింపు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫర్లు పొడిగింపు

ఏలూరు: బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రమోషనల్‌ ఆఫర్‌గా ప్రీ పెయిడ్‌ సెల్‌ వినియోగదారులకు ప్రవేశపెట్టిన ప్రతిభా ప్లస్‌ప్లాన్‌ ఎస్‌టీవీ 141ని పొడిగిస్తున్నట్లు జనరల్‌ మేనేజర్‌ కెఎస్‌ వరప్రసాద్‌ తెలిపారు. 49 రూపాయల ప్రతిభప్లస్‌ ప్లాన్‌తో 10 రోజుల పాటు ఇండియా మొత్తం అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత ఫ్రీ కాలింగ్‌ చేసుకోవచ్చునన్నారు. 200 ఉచిత ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ డేటా ఉచితంగా పొందవచ్చునన్నారు.

తదుపరి కాల్‌ చార్జీలు దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు రోమింగ్‌తోసహా ప్రతీ సెకన్‌కు ఒకపైసా ఛార్జి విధిస్తామన్నారు. 180 రోజులపాటు ప్లాన్‌ కాలపరిమితి ఉంటుందన్నారు. ఎస్‌టీవీ 141 ప్లాన్‌తో 141 రూపాయలతో 28 రోజులపాటు దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌లకు ఫ్రీ కాల్స్‌, 10జీబీ హైస్పీడ్‌ డేటా, రోజుకు 50 ఎస్‌ఎంఎస్‌లు పొందవచ్చునన్నారు. ఇతర వివరాలకు సమీప కస్టమర్‌ సర్వీస్‌సెంటర్‌లో తెలుసుకోవచ్చునన్నారు.

Check Also

కొటక్ మహీంద్రా బ్యాంకుకు ఆర్బీఐ భారీ షాక్

Share this on WhatsAppన్యూఢిల్లీ: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ సంస్థ కొటక్ మహీంద్రాకు భారతీయ రిజర్వు బ్యాంకు భారీ షాకిచ్చింది. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *