Breaking News
Home / States / Andhra Pradesh / ఆయనపై ప్రజలు నమ్మకం కోల్పోయారు….

ఆయనపై ప్రజలు నమ్మకం కోల్పోయారు….

విజయవాడ: రైతు భరోసాపై ముఖ్యమంత్రి జగన్ మాటతప్పారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో రూ.12,500 ఇస్తానని..ఇప్పుడు రూ.7,500 మాత్రమే ఇస్తానంటున్నారని అన్నారు. వైసీపీ వాలంటీర్లకు రూ. 8వేల వేతనం.. రైతుకు రూ.625 మాత్రమేనా? అని ప్రశ్నించారు. కులాలు, మతాల వారీగా రైతులను విడదీశారని బుద్దా వెంకన్న విమర్శించారు. రూ. 47వేల కోట్లు దోచుకున్న జగన్‌కు ప్రధానిని నిధులు అడిగే ధైర్యం లేదన్నారు. 5 నెలల్లోనే జగన్‌పై ప్రజలు నమ్మకం కోల్పోయారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *