విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని సొంత మీడియాలో చెప్పడం మాని.. కోటి 70 లక్షల మందికి ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయని… వైసీపీ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ భృతి ఎత్తేసి అవమానపరుస్తూ మాట్లాడతారా? అంటూ.. త్వరలో విజయసాయి నిరుద్యోగిగా మారడం ఖాయమన్నారు.
