అమరావతి: ట్విట్టర్ వేదికగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం సాగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్ర విమర్శలు చేశారు. ఎంత సంపాదించుకున్నా.. ఏ పదవిలో ఉన్నా.. ఇంకా దొరికినవన్నీ దోచుకోవాలనే రోగాన్ని ‘క్లెప్టోమేనియా’ అంటారట! అని ఎంపీ విజయసాయిరెడ్డిని ఉటంకిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాధి ఉన్నవారిని జైల్లో పెట్టినా వీరి బుద్ధి మారదని, పైగా దొంగతనం తప్పేం కాదన్న భావనతో దర్జాగా తిరిగేస్తుంటారని పేర్కొన్నారు. పలు కేసుల్లో ఏ-2గా ఉన్న విజయసాయిరెడ్డి సమస్య కూడా ఇదే.. పారాహుషార్! అంటూ ఘాటైన వ్యాఖ్యలతో బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.
