తూర్పు గోదావరి : ఇసుకను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ.. సిఐటియు ఆధ్వర్యంలో ఏలేశ్వరం బాలాజి చౌక్ సెంటర్లో భవన నిర్మాణ కార్మికులు మంగళవారం రాస్తారోకో చేపట్టారు. ప్రతీ కార్మికునికి రూ.12 వేలు ఇవ్వాలని, రైతుల ఆత్మహత్యలను నిరోధించేందుకు రైతుల రుణమాఫీ చేయాలని కోరారు. ఇసుక రేటును తగ్గించి ఇసుకను వెంటనే ఇవ్వాలని, కార్మిక చట్ట సవరణలను ఉప సంహరించుకొని ప్రైవేటీకరణను వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు.
