పశ్చిమ గోదావరి: మంగళవారం చింతలపూడి మండలంలో భవన నిర్మాణ కార్మికుల సంఘం నాయకులు ర్యాలీ నిర్వహించారు. ‘ ఇల్లైనా కట్టాలి.. పనైనా చూపాలి ‘ అంటూ నినాదాలు చేశారు. వందలాది మంది ఇసుక దొరక్క ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. వెంటనే ఇసుక ర్యాంపులను మండలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
